నిజాయితీపరుడిగా, అవినీతి మచ్చ అంటని రాజకీయవేత్తగా మన్‌మోహన్‌సింగ్‌కు ఎంతో పేరుంది. అందుకనే ఆయన్ను రెండుసార్లు కాంగ్రెస్ ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. కాని ఆయన భారత చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ ప్రధాని హోదాలో సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ మాజీ ప్రధాని కూడా సీబీఐ విచారణను ఎదుర్కొన్న పరిస్థితి లేదు. అంతేకాక గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరగనన్ని కుంభకోణాలు యూపీఏ హయాంలో బయటపడ్డాయి. 2-జీ స్కామ్, బొగ్గు మైనింగ్‌లో కేటాయింపులు, కామన్వెల్త్ గేమ్స్ రూపంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇక ప్రధానిగా మన్‌మోహన్ హయాంలోనే ఈ కుంభకోణాలన్ని చోటుచేసుకోవడంతో వీటికి ఆయన బాధ్యత వహించక తప్పని పరిస్థితి. ఇక బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి సీబీఐ ప్రధాని మన్‌మోహన్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఇవి తప్పుడు వార్తలని కాంగ్రెస్ వర్గాలు ఖండిస్తుండగా.. వీటిపై స్పందించడానికి సీబీఐ ప్రతినిధులు ఇష్టపడటం లేదు.