గత ఏడాది సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం '1' (నేనొక్కడినే). ఈ చిత్రం బాక్సా ఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచినప్పటికీ మేధావులు ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లోని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రం బి,సి ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ చిత్రం సామాన్యులకు సరిగ్గా కనెక్ట్ కాలేదని, వారికి సరిగ్గా అర్ధం కాలేదని విశ్లేషకులు తేల్చారు. ఇక విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే మన స్టార్ హీరోలు తమ మార్కెట్ పరిదిని పెంచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే అల్లుఅర్జున్ కు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. దాన్ని ఉపయోగించుకొన్న మరో మెగా హీరో రామ్ చరణ్ బన్నిని అడ్డుపెట్టుకుని 'ఎవడు' చిత్రంతో మలయాళంలో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. తాజాగా రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా 'ఏకలవ్య'గా మలయాళంలోకి అనువాదం అయింది. తాజాగా మహేష్ బాబు కూడా మలయాళం మార్కెట్ పై దృష్టి పెట్టాడు. మంచి అక్షరాస్యతతో పాటు క్లిష్టమైన, ప్రయోగాత్మక చిత్రాలను బాగా ఆదరించే మలయాళీలు మారి ఈ '1' చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తారో వేచిచూడాలి. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన అదే టైటిల్ తో రిలీజ్ కు ముస్తాబవుతుంది. ఈ చిత్రానికి సంబందించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.