ఎట్టకేలకు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. మైనింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డి మూడేళ్లుగా జైలులో మగ్గుతున్నాడు. ఈ కేసు నుంచి బెయిల్ పొందడానికి గాలి జనార్దన్‌రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేకపోయింది. గతంలో ఓసారి ఆయన బెయిల్ పొందినప్పటికీ జడ్జికి లంచం ఇచ్చి గాలి అక్రమంగా ఆ బెయిల్ సంపాదించారని సీబీఐ కేసు దాఖలు చేసింది. దీంతో ఆయన బెయిల్‌ను రద్దు చేయడమే కాకుండా తిరిగి జైలుకు పంపించి అదనంగా మరో కేసును కూడా నమోదు చేశారు. కొంతకాలం క్రితమే బెయిల్‌కు లంచం కేసులో గాలికి బెయిల్ రాగా తాజాగా మైనింగ్ కుంభకోణానికి సంబంధించి కూడా సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు గోడలనుంచి బయటకు వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ రెండు రోజుల్లో ఆయన జైలునుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.