Advertisementt

'ఐ', 'గోపాల గోపాల' చిత్రాలపై రాజమౌళి ట్వీట్..!

Tue 20th Jan 2015 05:07 AM
tollywood number one director,rajamouli,hero image,i,gopala goplala,tweet,film business  'ఐ', 'గోపాల గోపాల' చిత్రాలపై రాజమౌళి ట్వీట్..!
'ఐ', 'గోపాల గోపాల' చిత్రాలపై రాజమౌళి ట్వీట్..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి కి ఇక్కడ హీరోలకు సరిసమానమైన ఇమేజ్ ఉంది. ఆయన కూడా తాను చూసిన ఏ చిత్రమైనా బాగుంటే దాన్ని వెంటనే ప్రమోట్ చేస్తూ సినిమా కలెక్షన్లు పెరగడానికి, సినిమా విజయవంతం కావడానికి తనవంతు ప్రయత్నం చేస్తుంటాడు. ఇలా రాజమౌళి ప్రశంసలు పొందిన అనేక చిత్రాలు మంచి ఫలితాలను చవిచూశాయి. తాజాగా ఆయన శంకర్ 'ఐ', పవన్ కళ్యాణ్-వెంకటేష్ ల 'గోపాల గోపాల' చిత్రాల గురించి తన అభిప్రాయాలను ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ చేస్తూ... 'ఐ' చిత్రం రివ్యూలు, టాక్ పూర్తి భిన్నంగా ఉన్నాయి.అయితే కలెక్షన్లు మాత్రం అసాధారణం గా ఉన్నాయి.ఇక 'గోపాల గోపాల'  చిత్రం విషయానికి వస్తే సినిమా టాక్ చాలా బాగుంది. లాంగ్ వీకెండ్ ఈ రెండు సినిమాలకు బాగా కలిసొస్తుంది. కొత్త సంవత్సరంలో  ఫిల్మ్ బిజినెస్  ఆసక్తికరంగా మొదలైంది.. అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ