Advertisementt

మెగాభిమానుల ఆనందం..!

Tue 20th Jan 2015 02:26 AM
mega family,mega fans,news channels,pawan kalyan,chiru,congress,bjp,telugu desam,gopala gopala,ntr,anr,sharukhan,ajith  మెగాభిమానుల ఆనందం..!
మెగాభిమానుల ఆనందం..!
Advertisement
Ads by CJ

మెగాఫ్యామిలీ హీరోలను అభిమానించే మెగాఫ్యాన్స్ అప్పుడప్పుడు న్యూస్ చానెల్స్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న వార్తలపై కలత చెందుతున్నారు. అందుకు కారణం ఇద్దరి మధ్య పొసగడం లేదనే కధనాలు వినడమే... ఇద్దరు రాజకీయంగా చెరోదారిలో నడుస్తున్నారు. గత ఎన్నికల్లో చిరు కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తూ..కాంగ్రెస్ ను గెలిపించాలని విశ్వ ప్రయత్నం చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ కు బద్ధ శత్రువులైన బిజెపి, తెలుగుదేశం పార్టీల తరపున ప్రచారం చేసి, తాను అనుకున్నది సాధించగలిగాడు. అయితే రాజకీయం రాజకీయమే... కుటుంబం కుటుంబమే అనే విధంగా ఇద్దరు ముందుకు సాగుతుండటం విశేషం. మీడియాలో వస్తున్న వార్తల నేపధ్యంలో అనేక సందర్బాల్లో మెగాహీరోలు వివరణ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, తామంతా ఒకే కుటుంబం, ఎప్పుడు కలిసి ఉంటామని స్పష్టం చేసారు. పవన్ కూడా అనేక సందర్బాల్లో అన్నయ్య గురించి పాజిటివ్ గా మాట్లాడాడు.  తాజాగా మరోసారి పవన్ అన్నయ్య గురించి  మాట్లాడాడు. 'గోపాల గోపాల' ప్రమోషన్ లో భాగంగా ఆయన అన్నయ్య గురించి మాట్లాడుతూ... నేను అన్నయ్య  చిరంజీవి గారిని మాత్రమే హీరోగా చూశాను. ఆయనకు అభిమానులు ఉండడం చూశాను. అప్పుడు నన్ను నేను ఎప్పుడూ హీరోగా అనుకోలేదు. అన్నయ్య గారు.. స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్, షారుఖ్ ఖాన్, అజిత్ వంటివారు ఎవరి అండదండలు లేకుండా కష్టపడి పైకొచ్చారు... అని వ్యాఖ్యానించారు.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ