Advertisementt

ప్లానింగ్ లో ఉన్న మెగాహీరోలు..!

Tue 20th Jan 2015 02:08 AM
mega family,ram charan,yevadu,govindudu andaraivadele,allu arjun race gurram,pawan kalyan,gopala gopala,varun tej,sai dharam tej  ప్లానింగ్ లో ఉన్న మెగాహీరోలు..!
ప్లానింగ్ లో ఉన్న మెగాహీరోలు..!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ హీరోలు చాలా తెలివైన వారు. ఒకరి సినిమాలకు మరొకరు పోటీకి రాకుండా జాగ్రత్త పడుతూనే తమ తమ చిత్రాలను పండుగలకు, సమ్మర్ సెలవులకు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో విడుదలైన వారి చిత్రాలను చూస్తే ఎక్కువ కాలం సెలవులు వచ్చే సంక్రాంతి, దసరా సీజన్లలో రామ్ చరణ్ 'ఎవడు, గోవిందుడు అందరి వాడేలే', వచ్చాయి. సినిమాలు సూపర్ హిట్ కాకపోయినా పండగల పుణ్యమా అని మంచి కలెక్షన్లు రాబట్టి లాభాలతో, మహా అయితే స్వల్ప నష్టాలతో బయటపడ్డాయి. ఇక అల్లు అర్జున్ 'రేసుగుర్రం' ను వేసవికి తీసుకొచ్చి తన కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిపాడు. పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఏకైక తెలుగు చిత్రంగా 'గోపాల గోపాల'ను పోటీలోకి దింపి సోలోగా కలెక్షన్లు సాధిస్తున్నాడు. ఇక బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో  నటిస్తున్న చిత్రాన్ని మరోసారి వేసవి సెలవులనే టార్గెట్ చేస్తున్నాడు. ఇక తాజాగా వచ్చిన సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవ్వడానికి సిద్దపడుతున్నారు. మొత్తానికి ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి... అని అందరూ అనుకునేలా తమ చిత్రాలను వారు బరిలోకి దింపుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ