Advertisementt

ఓల్డ్ క్లాసిక్ ను రిజెక్ట్ చేసిన మహేష్..!

Mon 19th Jan 2015 06:28 AM
1,agadu,flop,vyjayanthi movies,aswaneedatt,career,raghavendra rao,krishna,vijayashanthi,radha,agniparvatham,remake,safe  ఓల్డ్ క్లాసిక్ ను రిజెక్ట్ చేసిన మహేష్..!
ఓల్డ్ క్లాసిక్ ను రిజెక్ట్ చేసిన మహేష్..!
Advertisement
Ads by CJ

వరుసగా '1, ఆగడు' చిత్రాల  ఫ్లాప్ ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అదే సమయంలో వైజయంతి మూవీస్ అధినేతగా, తెలుగులో భారీ నిర్మాతగా పేరొందిన అశ్వనీదత్ కెరీర్ కూడా బాగా లేదు. కాగా అశ్వనీదత్ తనే నిర్మాతగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో విజయశాంతి, రాధ హీరోయిన్లు గా దాదాపు 30 ఏళ్ళ కిందట నిర్మించిన చిత్రం 'అగ్ని పర్వతం'. ఈ చిత్రం ఆనాడు సంచలన విజయాన్ని సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం  చేసిన ఈ చిత్రంలో జమదగ్ని పాత్రలో కృష్ణ రెచ్చిపోయి నటించాడు. ఆ తర్వాత కూడా  ఈ చిత్రం పలుసార్లు విడుదలై, టీవీ చానెల్స్ లో ప్రసారమై అందరినీ ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. కాగా ఈ చిత్రాన్ని మహేష్ బాబు హీరోగా రీమేక్ చేయాలనే ఆశతో అశ్వనీదత్ ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మహేష్ ఆ విషయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూనే వస్తున్నాడు.  అయితే ఇప్పుడు మహేష్ బాబు ఫ్లాప్ లలో ఉండటంతో తమ 'అగ్ని పర్వతం' ప్రాజెక్ట్ మహేష్ కు చాలా సేఫ్ అనే ఉద్దేశ్యంగా నిర్మాత అశ్వనీదత్ మహేష్ ను సంప్రదించగా, తనకా ఉద్దేశ్యం లేదని, అసలు ఓల్డ్ క్లాసిక్స్ ను రీమేక్ చేసి పాడుచేసే ఉద్దేశ్యం తనకు లేదని మహేష్ కుండబద్దలు కొట్టాడట. దీంతో చేసేదీమీ లేక అశ్వనీదత్ మౌనం వహించాడని ఫిలిం నగర్ టాక్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ