Advertisementt

ప్రభాస్ షాక్ ఇవ్వనున్నాడా...!

Mon 19th Jan 2015 05:44 AM
attharintiki daredi,one,govindudu andarivadele,pawan kalyan,mahesh babu,bahubali,prabhas  ప్రభాస్ షాక్ ఇవ్వనున్నాడా...!
ప్రభాస్ షాక్ ఇవ్వనున్నాడా...!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం 100 కోట్ల క్లబ్ కు అతి దగ్గరకు వెళ్లడంతో అందరూ ఆనందపడ్డారు. ఆ తర్వాత వచ్చిన స్టార్ హీరోల చిత్రాలైన '1, ఆగడు, గోవిందుడు అందరివాడేలే' వంటి చిత్రాలతో పాటు పవన్, వెంకీలు కలిసి నటించిన 'గోపాల గోపాల' చిత్రంపై కూడా అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రాలేవీ కనీసం 'అత్తారింటికి దారేది' చిత్రం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకపోవడంతో అందరూ నిరుస్తాహాపడ్డారు. మరి తొలిసారిగా టాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరే చిత్రం ఏమిటి? ఆ చిత్ర హీరో ఎవరు? అనే విషయంపై పవన్, మహేష్ ల అభిమానులు తమ హీరోనే అంటే కాదు.. తమ హీరోనే అని వాదించుకుంటున్నారు. కానీ ఈ మధ్యలో వచ్చే రాజమౌళి-ప్రభాస్ ల 'బాహుబలి' చిత్రం ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని, తద్వారా ఆ ఫీట్ ను సాధించిన తొలి హీరోగా ప్రభాస్ నిలుస్తాడని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. మరి తమ తమ హీరోలపై ఎన్నో ఆసలు పెట్టుకున్న పవన్, మహేష్ ఫ్యాన్స్ కు గుట్టుచప్పుడు కాకుండా ప్రభాస్ షాక్ ఇవ్వడం ఖాయమని ఎక్కువ మంది నమ్మకం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ