Advertisementt

పాలడుగు కన్నుమూత..!!

Mon 19th Jan 2015 04:05 AM
paladugu venkatarao dead,paladugu venkatarao passed away,congress leader paladugu venkatarao,paladugu venkatarao dead in appolo hospital  పాలడుగు కన్నుమూత..!!
పాలడుగు కన్నుమూత..!!
Advertisement
Ads by CJ

రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన పాలడుగు వెంకట్రావు కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి ఆయన మృతిచెందారు. నూజివీడు ప్రాంతంలో జమిందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాలడుగుకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది. నూజివీడు ప్రాంతం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పాలడుగు నేదురుమల్లి క్యాబినేట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇందిరాగాంధీకి విధేయుడిగా పేరు పొందిన వెంకట్రావు ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్న పాలడుగు నూజివీడులో తనకున్న పెద్ద భవంతిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ