తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కొన్ని విషయాల్లో పోటీకి దిగుతున్నాయి. ప్రస్తుతం పోలీస్‌శాఖను పటిష్టపర్చడంలో రెండు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. హైదరాబాద్‌లోని పోలీస్ వ్యవస్థను బలపర్చడానికి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటిలోనే దాదాపు 300 ఇన్నోవా కార్లను కొనుగోలు చేసి కానుకగా అందజేశాడు. వీటికి బైక్‌లు అదనం. ఇక ఇప్పుడు చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌వ్యవస్థను పటిష్టపర్చడానికి పూనుకున్నాడు. ఇందులో భాగంగా బాబు ఏకంగా 2400 వాహనాలను కొనుగోలు చేసి పోలీస్‌శాఖకు అందించనున్నాడు. మొదటివిడతగా ఈ వాహనాలను సోమవారం విజయవాడలో చంద్రబాబు పోలీసులకు అందించనున్నాడు.