సదరు సినిమా తమ మనోభావాలను దెబ్బ తీసిందంటూ కొందరు థియేటర్ల ముందు ధర్నాలు చేయడం, పోస్టర్లను తగలబెట్టడం కామన్ అయ్యింది. అయితే, 'మెసెంజర్ ఆఫ్ గాడ్' అనే సినిమా విదుదలకు ముందు పలు వివాదాలు సృష్టిస్తుంది. ఈ సినిమాలో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గెటప్ సిక్కు మత గురువులను కించపరిచే విధంగా ఉందని కొందరు ఆందోళనలు చేపట్టారు. సినిమా చూసిన తర్వాత, 'మెసెంజర్ ఆఫ్ గాడ్'లో వివాదాస్పద అంశాలు ఉన్నాయని, కేంద్ర సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు అనుమతి నిరాకరించింది. ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అనూహ్యంగా సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇవ్వడం సెన్సార్ బోర్డు సభ్యులకు ఆగ్రహం తెప్పించింది.
సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ లీలా శాంసన్ గురువారం రాజీనామా చేయగా, శనివారం మరో 9 మంది బోర్డు సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయాలలో ప్రభుత్వ, రాజకీయ నాయకుల జోక్యం.. కొందరు అధికారుల అవినీతి వలన రాజీనామా చేస్తున్నట్టు సభ్యులు ఆరోపించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో..?