Advertisementt

నందమూరి హీరోతో 'బీరువా' ఫైట్..!

Sun 18th Jan 2015 12:25 PM
shankar i,gopala gopala,advantage,drop,theatres,distributors,patas,beeruva,sandeep kishan,nandamuri kalyan ram  నందమూరి హీరోతో 'బీరువా' ఫైట్..!
నందమూరి హీరోతో 'బీరువా' ఫైట్..!
Advertisement
Ads by CJ

సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన శంకర్ 'ఐ'.. ప్రేక్షకులను అంచనాలను అందుకోలేక చతికిలపడింది. 'ఐ' ప్లాప్ తో పవన్, వెంకీల 'గోపాల గోపాల'కు అడ్వాంటేజ్ అయ్యింది. డ్రాప్ అయిన కలెక్షన్స్ మళ్లీ పుంజుకున్నాయి. గోపాలుడి హంగామా తప్పిస్తే చాలా థియేటర్లలో పండగ వాతావరణం కనిపించడం లేదు. ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు జనవరి 23న విడుదలవుతున్న సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు. జనవరి 23న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'పటాస్', సందీప్ కిషన్ 'బీరువా' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 'పటాస్' సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ వినబడుతుంది. కొత్త దర్శకుడు అనిల్ రావిపూడి బాగా తీశాడని, ప్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని అంటున్నారు. మాస్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టులో కళ్యాణ్ రామ్ బాగా నటించాడట. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ 'బీరువా'తో సందీప్ కిషన్, కళ్యాణ్ రామ్ 'పటాస్'తో బాక్సాఫీస్ వద్ద పోటి పడుతున్నాడు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులు హోప్స్ పెట్టుకున్నారు. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ