దసరా కానుకగా భారీ అంచనాలతో విడుదలైన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అనుకున్న స్థాయిలో ఆదరించలేదు. అచ్చతెలుగు చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ కి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి హిందీలోకి రీమేక్ చేయాలని ఓ డైరెక్టర్ భావిస్తున్నాడట. అతనెవరో కాదు.. రీమేక్ స్పెషలిస్ట్ గా బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభుదేవా అని సమాచారం. ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన ఆయనకు ఈ చిత్రంలోని పాయింట్(?) బాగా ఆకట్టుకుందని, దీంతో ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఏదిఏమైనా మెగాహీరోలు ఈ సారి వరుసగా శ్రీకృష్ణుడి నామధేయమైన 'గోవిందుడు'గా, 'ముకుంద'గా.. 'గోపాల'గా వచ్చినప్పటికీ ఒక్కటి కూడా సూపర్ హిట్ కాకపోవడం మెగాఫ్యాన్స్ ను నిరుత్సాహపరుస్తోంది.