Advertisementt

ఒక చిత్రానికి ముగ్గురు దర్శకులు..!

Sat 17th Jan 2015 06:49 AM
ajith,goutham menan,ennai irindaal,sreedhar raghavan,thyagaraja kumar raja,anushka,trisha  ఒక చిత్రానికి ముగ్గురు దర్శకులు..!
ఒక చిత్రానికి ముగ్గురు దర్శకులు..!
Advertisement
Ads by CJ

సాధారణంగా ఒక సినిమాకు ఒకే డైరెక్టర్ ఉంటాడు. అయితే ఒక్కోసారి సినిమా మధ్యలో దర్శకుడికి మిగతా వారితో ఏమన్నా గొడవ జరిగి ఆ డైరెక్టర్ ప్రాజెక్ట్ వదిలేస్తే మరో డైరెక్టర్ వచ్చి ఫినిష్ చేస్తాడు. అయితే తాజాగా డైరెక్టర్ ఉండగానే ఆయన అనుమతితో మరో ఇద్దరు డైరెక్టర్స్ పనిచేయడం జరిగింది. అదీ ఓ స్టార్ హీరో సినిమాకు. అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎన్నై ఇరిందాల్' (తెలుగులో ఎంతవాడుగానీ) చిత్రానికి ముగ్గురు దర్శకులు పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ప్రధాన దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. చిత్రీకరణ తదితర పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని భావించాం. నాతోపాటు దర్శకులు శ్రీధర్ రాఘవన్, త్యాగరాజ కుమారరాజా పని చేస్తున్నారు. వారి సాయం కోరగానే దర్శకత్వ భాద్యతలు చేపట్టారు.. అని తెలిపాడు. ఎ.యం.రత్నం పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో అనుష్క త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ