Advertisementt

భారీ చిత్రాలంటే భయపడుతున్నారు..!

Sat 17th Jan 2015 06:04 AM
distributors,varna,kocchadayaan,linga,i,tollywood,gunasekhar rudhramadevi,rajamouli bahubali  భారీ చిత్రాలంటే భయపడుతున్నారు..!
భారీ చిత్రాలంటే భయపడుతున్నారు..!
Advertisement
Ads by CJ

ఇటీవల కాలంలో కొన్ని చిత్రాలు భారీ బడ్జెట్ తో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసి అటు డిస్ట్రిబ్యూటర్లను, ఇటు నిర్మాతలనే కాదు.. సినీ అభిమానులను కూడా తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. వీటిలో 'వర్ణ, కొచ్చాడయాన్, లింగ, ఐ' వంటి చిత్రాలు మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రెండు భారీ బడ్జెట్ చిత్రాలపై అందరిలోనూ భయాందోళనలు నెలకొని ఉన్నాయి. గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రుద్రమదేవి', రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'బాహుబలి' చిత్రాలపై కొనుగోలుదారులకు అపనమ్మకం ఏర్పడుతోంది. ఈ ఎఫెక్ట్ వల్ల ఈ చిత్రాల బిజినెస్ విషయంలో కొన్ని ఆటుపోట్లు తప్పదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ