Advertisementt

బుల్లితెరపై 'ఆగడు' సూపర్ హిట్..!

Sat 17th Jan 2015 06:02 AM
mahesh babu,aagadu movie,trp ratings,gemini tv,family audience  బుల్లితెరపై 'ఆగడు' సూపర్ హిట్..!
బుల్లితెరపై 'ఆగడు' సూపర్ హిట్..!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీను వైట్ల కలయికలో వచ్చిన 'ఆగడు' సినిమా మొదటి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సూపర్ స్టార్ వీరాభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురి చేసిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను తీసుకొచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై బోల్తా కొట్టిన ఈ సినిమా అనూహ్యంగా స్మాల్ స్క్రీన్ ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సినిమాకు అద్బుత స్పందన లభించింది. టిఆర్పీ రేటింగ్లలో 'ఆగడు' టాప్ చైర్ దక్కించుకుందట. థియేటర్లలో ఎక్కువ రోజులు సినిమా లేకపోవడంతో మెజారిటీ మహేష్ బాబు అభిమానులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా చూసే అవకాశం దొరకలేదు. వారంతా జెమినీ టీవీలో సినిమా చూశారని బుల్లితెర విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ