Advertisementt

చివరకు వరుణ్ సందేశ్ ఇలా ట్రై చేశాడు..!

Sat 17th Jan 2015 05:41 AM
happy days,kottha bangarulokam,varun sandesh,mass image,paddanandi premalo mari  చివరకు వరుణ్ సందేశ్ ఇలా ట్రై చేశాడు..!
చివరకు వరుణ్ సందేశ్ ఇలా ట్రై చేశాడు..!
Advertisement
Ads by CJ

 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాలు తప్ప కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ లేని వరుణ్ సందేశ్, పట్టు వదలని విక్రమార్కుడిలా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయినా, విజయం ఈ ఎన్నారై హీరోకి అందని ద్రాక్షలానే మిగిలింది. ఇక లాభం లేదనుకుని.. మాస్ సబ్జెక్టుతో 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాను చేశాడు. రెండు రోజుల క్రితం పూరి జగన్నాధ్ ఈ సినిమా ట్రైలర్ ను ఆవిష్కరించారు. స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ ట్రైలర్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ స్క్రిప్ట్ అని అర్ధమవుతుంది. ఓ పాటలో హీరోయిన్ వితిక శేరు గ్లామరస్ గా కనిపించింది. ఓ సీన్లో హీరో డోర్ బద్దలయ్యింది. మరోచోట సుమో చేజ్, వరుణ్ సందేశ్ పంచ్ డైలాగ్.. పోసాని కృష్ణమురళి, ఎంఎస్‌ నారాయణ, తాగుబోతు రమేష్‌ తదితర కమెడియన్ల హంగామా, స్ట్రాంగ్ విజనిజం ఇలా ట్రైలర్ కళగానే కనపడుతుంది. విజయం కోసం వరుణ్ సందేశ్ మాస్ సినిమాలను నమ్ముకున్నాడు, చివరకు ఇలా ట్రై చేశాడు అని విమర్శకులు, విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రై చేయడంలో తప్పు లేదుగాని వరుణ్ సందేశ్ ను ప్రేక్షకులు మాస్ హీరోగా ఆదరిస్తారా..? అనేది సందేహం

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ