Advertisementt

మెగా మేనల్లుడు సుబ్రమణ్యం అదరగొట్టాడు..!

Sat 17th Jan 2015 05:34 AM
pilla nuvvu leni jeevitham,sai dharam tej,subrahmanyam for sale,first look,gabbar singh fame,harish shanka  మెగా మేనల్లుడు సుబ్రమణ్యం అదరగొట్టాడు..!
మెగా మేనల్లుడు సుబ్రమణ్యం అదరగొట్టాడు..!
Advertisement
Ads by CJ
'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో హీరో మెటీరియల్ అనిపించుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంక్రాంతికి తన కొత్త సినిమా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. 'గబ్బర్ సింగ్' ఫేం హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సూపర్ హిట్టయ్యింది. మెగా కుటుంబానికి మొదటి నుండి వెనుదన్నుగా, అండ దండగా నిలుస్తున్న మాస్ ఆడియన్స్ ని 'సుబ్రమణ్యం' ఖుషి చేశాడు. డాన్సింగ్ లో చిరంజీవి ఈజ్, డ్రెస్సింగ్ లో పవన్ కళ్యాణ్ స్టైల్.. సాయి ధరమ్ తేజ్ లో కనపడింది. దాంతో అభిమానులు వెంటనే కనెక్ట్ అయిపోయారు. 'రామయ్యా వస్తావయ్యా' ప్లాప్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మాస్ హీరోఇజం ఎలివేట్ చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసిన హరీష్.. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడట. అతని స్క్రిప్ట్ కి సూటయ్యే హీరో దొరకడంతో సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మెగా అభిమానులను ఆకట్టుకునేలా టీజర్ కట్ చేసి వదిలాడు. సినిమా స్టార్టింగ్ నుండి ఓ స్టార్ సినిమా అన్నట్టుగా ఓ మాస్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాడు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ