Advertisementt

కేసీఆర్‌ అన్న కుమార్తె కాంగ్రెస్‌లోకి..!!

Fri 16th Jan 2015 02:33 AM
kcr brother daughter regulapati ramya joining congress,regulapati ramya allegations on kcr,regulapati ramya vs kcr family,regulapati ramya about ramoji rao and kcr  కేసీఆర్‌ అన్న కుమార్తె కాంగ్రెస్‌లోకి..!!
కేసీఆర్‌ అన్న కుమార్తె కాంగ్రెస్‌లోకి..!!
Advertisement
Ads by CJ

ఓవైపు 'ఆకర్ష్‌' పథకంలో భాగంగా తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్‌ఎస్‌లోకి జంపవుతున్నారు. కాని కేసీఆర్‌ కుటుంబ విషయంలో మాత్రం ఇది రివర్స్‌గా ఉంది. స్వయంగా కేసీఆర్‌ అన్న కుమార్తె కాంగ్రెస్‌లో చేరడం రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బుధవారం కేసీఆర్‌ ఆన్న కుమార్తె రేగులపాటి రమ్య పొన్నాల సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతున్నాడని, అందుకే ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు. అంతేకాకుండా రామోజీతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని, గతంలో ఫిల్మ్‌సిటీలో పెద్ద మొత్తంలో అసైన్డ్‌ భూములను రామోజీ కబ్జా చేసినట్లు కేసీఆరే ఆరోపించిన విషయాన్ని ఆమె గుర్తించారు. కాని ఇప్పుడు మాత్రం ఫిల్మ్‌సిటీలో ఒక్క అంగుళం కూడా కబ్జాకు గురికాలేదని కేసీఆర్‌ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. త్వరలోనే ప్రజలు కేసీఆర్‌కు తగిన గుణపాఠం నేరుపుతారని విమర్శించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ