Advertisementt

చక్రిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు..!!

Thu 15th Jan 2015 08:22 AM
chakri death,chakri mother vs chakri wife,controversy in chakri family,case in jubileehills police station on chakri death,chakri wife sravani in media,sravani on chakri death  చక్రిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు..!!
చక్రిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు..!!
Advertisement
Ads by CJ

చక్రి మరణం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆయన ఆస్తులకు సంబంధించి గొడవలు చివరకు చక్రి మరణాన్ని అనుమానాస్పదంగా మార్చేశాయి. కేటీఆర్‌ అంతటివాడే జోక్యం చేసుకున్నా వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. తాజాగా చక్రిది అనుమానాస్పద మృతిగా జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 174 సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కుమారుడి మృతి వెనుక కోడలు శ్రావణి హస్తం ఉందని, గతంలో పలుమార్లు తనకు ఫోన్‌ చేసి చక్రిని హత్య చేస్తానని బెదిరించిందని విద్యావతి ఆరోపిస్తోంది. కావాలంటే తన కాల్‌ డేటాను బయటకు తీస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పింది. అంతేకాకుండా చక్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా శ్రావణి అడ్డుకుందన్నారు. ఇవన్ని విషయాలను బట్టి చక్రిని తమ కోడలే హత్య చేసిందనడానికి ఎలాంటి అనుమానాలు అక్కరలేదని బలంగా చెబుతోంది. మరి ఈ కేసు ఎక్కడినుంచి ఎక్కడి వరకు వెళుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ