సొంత రాష్ట్రం కావాలన్న తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ప్రస్తుతం తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్న దశ. తెలుగు సినిమా తెలంగాణ సినిమాగా అభివృద్ధి జరగాల్సిన తరుణమిది. ఈ సమయంలో తెలుగు సినిమా కళను పునరుద్ధరింపజేయటం, పునర్నిర్వచించటం, పునరుజ్జీవింపచేయటం అవసరం. అందుకు తెలంగాణ ప్రభుత్వ తోడ్పాటు ఎంతో అవసరం. తెలుగు సినిమా దారిలో పడాలంటే, జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఉనికి చాటుకోవాలంటే పకడ్బందీ ప్రణాళిక ..ఆచరణయోగ్యమైన నూతన పద్ధతులూ.. కళాత్మకతను వెలికితీసే దారులూ అవసరం.తెలంగా ణ సంస్కృతీ సంప్రదాయాలు,యాస , ప్రేమ త్యాగనిరతులు మానవసంబంధాలు .ఉత్తమమైన మానవ భావోద్వేగాలు కలిగిన సినిమాలను నిర్మించాల్సిన అవసరం ఉన్నది. తెలుగు ఇండస్ట్రీలో భాగమైన తెలంగాణ ప్రాంతం నుంచి అగ్రభాగాన నిలబడిన కళాకారులు చాలా అరుదు.వీరు కాక మరికొంత మంది కళాకారులు ఉన్నా సరైన ఆదరణ లభించక వెనుకబడ్డారు.తెలంగాణ గడ్డ పై పుట్టిన కళాకారుల ప్రతిభ ను గుర్తిస్తూ వారిని ప్రోత్సహించడానికి ఒక వేదిక కావాలి.ఆ వేదికే...'తెలంగాణ సినిమా అవార్డ్స్ '
సంజయ్ (వి డ్రీమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ) మాట్లాడుతూ : వందేళ్ల సినిమా చరిత్రలో తెలంగాణ అన్ని రంగాలలో వెనుకబడి ఉంది. కవులు ,కళాకారులు ,రచయితలు తప్ప మిగత వారికి ఆదరణ లభించడం లేదు.ఇటువంటి పరిస్థితి ఇకముందు తెలంగాణ కళాకారులకు రాకుండా చేయడంతో పాటు కొత్త వారిని ప్రోత్సహించే విధంగా ఒక మంచి ఉద్దేశ్యంతో ' తెలంగాణ సినిమా అవార్డ్స్ ' ఏర్పాటు చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నామని అన్నారు.తెలంగాణ కళాకారులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన సినీ కళాకారులను తెలంగాణ గడ్డ పై కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన అందరికీ ఈ అవార్డులతో సత్కరిస్తామని అన్నారు..తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ,తెలంగాణ సినిమా ఇండస్ట్రీ లు అన్నదమ్ముల్లాగా ఒకరినిఒకరు ప్రోత్సాహించుకుంటూ ముందుకెళ్లాలని కొరుకుంటున్నాము.మేము మొదలు పెట్టేబోయే తెలంగాణ సినిమా అవార్డ్స్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే విధంగా తెలంగాణ సినీకళాకారులు సహాకరిస్తారని ఆశిస్తున్నాము.త్వరలోనే ' తెలంగాణ సినిమా అవార్డ్స్ ' కమీటిని , జ్యూరీ మెంబర్స్ ను తెలియజేస్తామని అన్నారు..
యోగేందర్ ( వి డ్రీమ్స్ సి.ఇ.ఓ ) మాట్లాడుతూ : తెలంగాణ ఇరవై నాలుగు శాఖల కు చెందిన టెక్నిషియన్స్ ఉన్నత స్థాయిలో నిలబడటానికి కృషి చేస్తున్న కళాకారులను ఆర్థికంగా , హార్థికంగా ,సాంకేతికంగా ప్రోత్సహించడమే లక్ష్యంగా ' తెలంగాణ సినిమా అవార్డ్స్ ' ను ఇవ్వనున్నట్లు తెలిపారు.కావున కవులు , కళాకారులు ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు.