బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ -ఇండియన్ క్రికెటర్ విరాట్ కొహ్లీ గురించి ఇప్పుడు ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నారు. అయితే పెళ్ళికి ముందే ఇద్దరూ కాస్త హద్దుమీరి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇటీవల ఓ ప్రముఖ మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనుష్క ఆసక్తికర కామెంట్స్ చేసింది. మా ఇద్దరి ప్రేమాయణాన్ని అనవసర రాద్దాంతం చేస్తున్నారు. నేను కొహ్లి కాబట్టి అది మరింత ఎక్కువైంది. నేను మా పక్కింటి అబ్బాయిని ప్రేమిస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదు. అదే సమయంలో కొహ్లీ వేరే స్టార్ ప్రేమలో పడ్డా కూడా ఇలాగే ఉండేది. కానీ నా విషయంలో ముఖ్యంగా నాపై ఇంతలా ఎందుకు ఈర్ష్య పడుతున్నారో అర్ధం కావడం లేదు. నేను నీ లవర్ కానప్పుడు నీకెందుకు అంత ఈర్ష్య? నేను ఎవరితో తిరిగితే మీకేంటి? అంటూ తనపై విమర్శలు చేసే వారందరిపై ఎదురు విమర్శలు చేసింది. ఇంకా ఆమె మాట్లాడుతూ... నా వెనక విమర్శలు చేసే వారంతా పిరికివాళ్ళు... అంటూ మండిపడింది. ఇండియా మినహా విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా మా ఇద్దరికీ బొకేలు ఇచ్చి గౌరవిస్తున్నారు. ఇక్కడ మాదిరి అక్కడ ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే అలవాటు లేదు. మన వాళ్లలో ఇలాంటి మార్పు ఎప్పుడు వస్తుందో? అంటూ అనుష్కశర్మ చిర్రుబుర్రులాడింది.