కేంద్ర మంత్రి ముక్తి అబ్బాస్ నక్వీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. 2009లో ఎన్నికల నియమావళిని ఉల్లఘించారని ముక్తి అబ్బాస్ నక్వీపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు కొనసాగుతోంది. అయితే ఐదేళ్లుగా నక్వీ జోలికి రాని యూపీ పోలీసులు తాజాగా ఆయన్ను అరెస్టు చేయడం కలకలం రేపింది. కావాలనే ఎస్పీ ప్రభుత్వం నక్వీని అరెస్టు చేయించిందంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కాగా నిబంధనల మేరకు నక్వీని అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ అరెస్టుకు సంబంధించి నక్వీకి వెంటనే బెయిల్ లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొద్దికాలం క్రితమే పశ్చిమ బెంగాల్‌లో శారదా స్కాంకు సంబంధించి ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిని సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం నక్వీ అరెస్టు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.