రికార్డులు సృష్టించడం.. తిరిగి వారే దాన్ని బద్దలు కొట్టడం చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. అలాంటి ఫీట్‌ను అమీర్‌ఖాన్ సాధించారు. మొదట 'త్రీ ఇడియట్స్' సినిమాతో హైస్ట్ కలెక్షన్ల రికార్డు సృష్టించిన అమీర్‌ఖాన్.. ఆ తర్వాత ఆ రికార్డును తన 'ధూమ్-3' సినిమాతో తానే బ్రేక్ చేశాడు. 'ధూమ్-3' సినిమా కలెక్ట్ చేసిన రూ. 547 కోట్లు 'పీకే' సినిమా రిలీజయ్యే వరకు కూడా ఓ రికార్డుగా నిలిచింది. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ నటించిన తాజా చిత్రం 'పీకే' మొత్తం రూ. 620 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమా రూ. 100 కోట్లు కలెక్ట్ చేయడమే గొప్ప విషయం. అలాంటిది ఇప్పుడు ఏకంగా అమీర్‌ఖాన్ చిత్రం 'పీకే' రూ. 600 కోట్ల మార్క్‌ను అందుకోవడం బాలీవుడ్ వర్గాలను ఆనందంలో ముంచెత్తుతోంది. మరోవైపు 'పీకే' సినిమాపై అనేక వివాదాలు తలెత్తుతున్నా.. కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం గమనార్హం.