Advertisementt

మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అనిపించుకొంటాడా..!

Wed 14th Jan 2015 06:46 AM
tamil star,young hero,karthi,tollywood star,nagarjuna,vamsi paidipalli,exciting,sruthihasan,metropolitan,avara,na peru siva,dubbing,telugu version script,mister perfectionist  మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్  అనిపించుకొంటాడా..!
మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అనిపించుకొంటాడా..!
Advertisement
Ads by CJ

తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడు యంగ్ హీరో తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు... ఆయన తెలుగులో మాట్లాడుతుంటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అచ్చతెలుగు కుర్రాడిలా స్వచ్చమైన తెలుగులో ఆయన మాట్లాడతాడు. కాగా త్వరలో కార్తి టాలీవుడ్ స్టార్ నాగార్జునతో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విషయమై స్పందించిన కార్తి.. నాగార్జున గారితో కలిసి సినిమా చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ చిత్రంలో నేను మెట్రోపాలిటన్ యువకుడిగా నటిస్తున్నాను. కాగా ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది. అయితే ఆమె పాత్ర అన్నీ సినిమాలలోని పాత్రలా ఉండదు. ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది. కాగా గతంలో నేను 'ఆవారా, నాపేరు శివ' వంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలకు సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నాను. అయితే ఈ తాజా చిత్రానికి అంతకంటే  స్వచ్చంగా తెలుగు మాట్లాడే ఉద్దేశ్యంతో ఉన్నాను. అచ్చమైన తెలుగువాడిలా డబ్బింగ్ చేబుతాననే నమ్మకం నాకుంది. అందుకే ఈ చిత్రం తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ ను నాకు పంపించమని కోరాను. దాని కష్టపడి ఎలాగైనా తెలుగువారందరూ మెచ్చే విధంగా తెలుగులో డైలాగ్స్ చెబుతాను.. అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి కార్తిని మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అని చెప్పుకునే రోజు మరెంతో దూరంలో లేదు.. అనిపిస్తోంది.       

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ