రామోజీరావు తనయుడు ఈటీవీ సుమన్ బతికివున్నప్పుడు ఈటీవీ లో అన్నీ తానై వ్యవహరించి, ఆ తర్వాత చాలా వివాదాలను ఫేస్ చేసిన నటుడు ప్రభాకర్. ఈటీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, నిర్వాహకుడిగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత ఈటీవీ నుండి బయటకు వచ్చాడు. సినిమాల్లో కూడా మంచి చాన్స్ లు సంపాదించి, ఆ తర్వాత జీటీవీ వంటి చానెల్స్ ను లైన్ లో పెట్టుకున్నాడు. 'ముద్దుబిడ్డ' సీరియల్ ద్వారా దర్శకునిగా మారిన ఆయన ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి అయ్యాడు. దానికి కారణం ఆయన త్వరలో మెగాఫోన్ చేతబట్టనుండటం కారణం కాగా.. ఆ సినిమాను ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లుఅరవింద్ నిర్మించనుండటం మరో కారణం. ఇప్పటికే ఆయన అల్లుఅరవింద్ కు ఓ స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబందించిన వివరాలు అతి త్వరలో అఫీషియల్ గా వెల్లడికానున్నాయి. కాగా ఈ చిత్రం ఓ లోబడ్జెట్ చిత్రంగా తెరకెక్కనుందని తెలుస్తుంది.