Advertisementt

ఫిలీంసిటీపై మాట మార్చిన కేసీఆర్‌..??

Mon 12th Jan 2015 03:37 AM
kcr in ramoji films city,telangana cm kcr,kcr vs ramoji rao,kcr about ramoji film city,kcr vs chandrababu naidu,new film city in telangana  ఫిలీంసిటీపై మాట మార్చిన కేసీఆర్‌..??
ఫిలీంసిటీపై మాట మార్చిన కేసీఆర్‌..??
Advertisement
Ads by CJ

అధికారంలోకి రాగానే లక్ష నాగళ్లతో రామోజీ ఫిలీం సిటీని దున్నిస్తా.. ఇది ఎన్నికలకు ముందు కేసీఆర్‌ చెప్పినట్లుగా పలు వార్త పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఇటీవలె కేసీఆర్‌ ఫిలీంసిటీకి వెళ్లి అందరికీ షాకిచ్చాడు. తెలంగాణకే ఫిలీంసిటీ తలమానికమని ప్రశంసలు వర్షం కురిపించాడు. దీంతో తెలంగాణవాదులు నివ్వెరపోయారు. రామోజీతో కేసీఆర్‌కు ఏవైనా అంతర్గత ఒప్పందాలు చేసుకున్నారా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే కేసీఆర్‌ మాత్రం తాను ఎప్పుడూ ఫిలీంసిటీని దున్నిస్తానని చెప్పలేదని చెబుతున్నారు. మీడియా తనకు తాను వార్తలు సృష్టించుకుంటే తాను ఏమీ చేయలేనని కూడా పేర్కొన్నారు. మరి మీడియా తప్పుడు కథనాలు రాసినప్పుడు కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదన్నది అర్థం కాని ప్రశ్న. అంతేకాకుండా ఫిలీంసిటీ కోసం కొన్ని వందల ఎకరాలు రామోజీ ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపిస్తూ.. పలుమార్లు ధర్నాకు కూడా దిగారు. అయితే కేసీఆర్‌ మాత్రం ఫిలీంసిటీలో ఒక్క అంగుళం కబ్జా కూడా జరగలేదని క్లీన్‌చీట్‌ ఇచ్చారు. మరి మున్ముందు ఇలాంటి వార్తలను తెలంగాణ ప్రజలు ఎన్ని వినాల్సి వస్తుందో..!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ