Advertisementt

నయనతార ను ఇలా చూస్తారా?

Mon 12th Jan 2015 02:12 AM
nayanthara,dumb role,nanum rowdydan,srirama rajyam  నయనతార ను ఇలా చూస్తారా?
నయనతార ను ఇలా చూస్తారా?
Advertisement
Ads by CJ

తన హాట్ అండ్ సెక్సీ ఒంపుసొంపులతో సౌత్ ఇండియాలో హాటెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న భామల్లో నయనతార ఒకరు. ఆమె అందం చూసి అదరహో అననివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి నయనతారను చెవుడు సమస్యతో బాధపడే క్యారెక్టర్ లో చూడాల్సివస్తే అభిమానులు ఎలా ఫీలవుతారు? అనేది ప్రశ్నార్ధకమే. ఈ మధ్య గ్లామర్ గా నటించడం తగ్గించిన నయన, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటుంది. అందగత్తెగా తనకు వచ్చిన పేరు ఇక చాలు అనుకుందో ఏమో గానీ మంచి నటిని అనిపించుకోవడానికి ఆమె ఆరాటపడుతోంది.

తాజాగా ఆమె ఓ తమిళ చిత్రంలో పోషిస్తున్న పాత్ర అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఈ చిత్రం పేరు 'నానుమ్ రౌడీడాన్'. ఈ చిత్రంలో నయన చెవిటి అమ్మాయిగా నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని, ప్రేక్షకులను కట్టిపడేసేలా ఆమె నటన ఉంటుదని అంటున్నారు. ఆమె కెరీర్ లో ఇప్పటివరకు 'శ్రీ రామరాజ్యం'లో చేసిన సీత పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత ఈ చిత్రంలో ఆమె చేస్తున్న బదిర పాత్ర మరోసారి విమర్శకుల ప్రశంసలు పొందడం ఖాయం అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ