తండ్రులు పదవుల్లో ఉంటే తనయుల ఆగడాలకు అంతు ఉండదు. విలాసాలకు, జల్సాలకు కొదవ ఉండదు. అయితే ఈ జల్సా పరిమితి దాటితేనే అసలైన చిక్కు వచ్చిపడుతుంది. పక్కల వారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుంది. కేంద్రమంత్రి సుజనాచౌది కుమారుడు కూడా ఇలాగే వ్యవహరించాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కారును గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా ఆ కారులో మాజీ మంత్రి దానం నాగేందర్ అల్లుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంత మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు ఏమాత్రం అదుపుతప్పిన ఎలాంటి ప్రమాదం ముంచుకువస్తుందో.. ఎందరి ప్రాణాలకు ముప్పు తెస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. జనాలకు నీతులు చెప్పే నాయకులు ముందు తమ పిల్లలను దారిలో పెట్టుకుంటే మంచిదనే విమర్శలు వినిపిస్తున్నాయి.