Advertisementt

టీడీపీలోకి మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు..??

Sat 10th Jan 2015 12:26 PM
ydr congress mlas into tdp,nellore ycp mlas joining tdp,ycp mlas into tdp,jagan mohan reddy vs chandrababu naidu,ysr congress president jagan mohan reddy  టీడీపీలోకి మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు..??
టీడీపీలోకి మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు..??
Advertisement
Ads by CJ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర ఆగడం లేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి సన్నద్ధమవుతున్నారన్న వార్తలు వినబడుతున్నాయి. ఇందులో ఇప్పటికే ఒకరు టీడీపీ నాయకులతో బహిరంగంగా మీడియా సమావేశాల్లో పాల్గొంటుండటంతో ఆయన చేరిక ఖాయంగా కనిపిస్తోంది. గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిలు టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. వీరిలో సునీల్‌కుమార్‌ ఇప్పటికే టీడీపీ నాయకులతో కలిసిమెలిసి తిరగడమే కాకుండా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోతే రేపోమాపో టీడీపీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వీరి జంపింగ్‌ను అడ్డుకోవడానికి జగన్‌ ఎలాంటి ఎత్తులు వేస్తారో వేచిచూడాల్సిందే..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ