Advertisementt

వరుణ్ తేజ్ సినిమా సినిమా కో కోటి..!

Sat 10th Jan 2015 04:51 AM
varun tej,mega hero,naga babu,mukunda,varun tej remuneration,varun tej future projects  వరుణ్ తేజ్ సినిమా సినిమా కో కోటి..!
వరుణ్ తేజ్ సినిమా సినిమా కో కోటి..!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ హీరో గా, మెగా బ్రదర్ నాగబాబు తనయుడిగా మెగా ఫ్యాన్స్ అండదండలు పుష్కలంగా ఉన్న హీరో వరుణ్ తేజ్. ఆయన నటించిన తొలి చిత్రం 'ముకుంద' ఇటీవలే విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే వరుణ్ తేజ్ లుక్ కు, పెర్ఫార్మన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇదే సమయంలో ఆయన తన రెండో చిత్రంగా గీతాఆర్ట్స్ బేనర్ తో పాటు, క్రిష్- డి వి వి దానయ్యలు సంయుక్తంగా క్రిష్  దర్శకత్వం లో  'శివం' చిత్రం చేయనున్నారు. ఈ చిత్రానికి గాను వరుణ్ తేజ్ కు రెండు కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. తన రెండో చిత్రానికే రెండు కోట్లు తీసుకుంటున్న ఆయన ఈ చిత్రం విడుదలై హిట్ అయితే  3వ చిత్రానికి 3 కోట్లు తీసుకోవడం ఖాయం అనుకుంటున్నారు.  తన మూడో చిత్రాన్ని పూరీ జగన్నాధ్ దర్శకత్వం లో  సి.కళ్యాణ్ నిర్మాతఃగా  చేయనున్నాడు. కాగా తన మొదటి చిత్రంలో డాన్స్ పరంగా వీక్ అనిపించుకున్న వరుణ్ తన రెండో చిత్రంలో ఆ లోటును భర్తీ చేయడానికి బాగా కష్టపడుతున్నాడని తెలుస్తుంది.  మొత్తానికి ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న తన తండ్రి నాగబాబుకు వరుణ్ తేజ్  సినిమా ఆరంగేట్రం చేయడం కాస్త ఉపసమనాన్ని కలిగిస్తుందనే చెప్పాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ