Advertisementt

అందుకే రజిని గ్రేట్..!

Sat 10th Jan 2015 04:47 AM
rajinikanth,superstar,tamil,media,lingaa,great  అందుకే రజిని గ్రేట్..!
అందుకే రజిని గ్రేట్..!
Advertisement
Ads by CJ

ఒక నటుడు చరిత్రలో నిలిచిపోయే ఇమేజ్ సంపాదించుకోవాలంటే ఆ  నటుడి నటన తో పాటు అతని వ్యక్తిత్వం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇక సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనికాంత్ ఇదే కోవలోకి చేరుతారు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. చాలా సింపుల్ బిహేవియర్. కాగా రజని సినిమాలలో తప్ప మీడియాలో కనిపించడం చాలా తక్కువ. ఆయన గురించి వార్తలే తప్ప ఆయన స్వయంగా మీడియాతో మాట్లాడటం చాలా అరుదు. ఆడియో ఫంక్షన్లు, ఇతరత్రా కార్యక్రమాలలో మాత్రం సందర్భానుసారం మాట్లాడుతాడు. అసలు ఆయన ఎందుకు మీడియా తో అంతగా ఇంటరాక్ట్ అవ్వరు? అనే విషయాన్ని రజని స్వయంగా సమాధానం ఇచ్చాడు. 

ఈ విషయం గురించి రజని మాట్లాడుతూ... మీడియాతో మాట్లాడటానికి నేనేమి గొప్ప పనులు చేయలేదు. అలాంటప్పుడు మీడియాతో మాట్లాడటానికి ఏముంటుంది? నా గురించి నేను మీడియాతో మాట్లాడటం నాకు నచ్చదు... అంటూ సింపుల్ గా సమాధానం ఇచ్చాడు తలైవర్. కేవలం గొప్ప పనులు చేసిన వారు మాత్రమే ఆ విషయాలు చెప్పటానికి మీడియాను ఆశ్రయిస్తారు. నేను ఆ కేటగిరికి చెందిన వాడిని కాదని నా భావన. నేనేమిటో..నేను చేసే పనులే చెబుతాయి... అంటూ సమాధానం ఇచ్చాడు. మొత్తానికి ఆయన మాటలను బట్టి మీడియాకు దూరంగా ఉండటానికే రజని ఇష్టపడతాడు అని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ