Advertisementt

అల్లు శిరీష్ కోసం కథల మీద కథలు..!

Sat 10th Jan 2015 04:43 AM
allu sirish,parusuram,chuttalabbayi,kotha janta,gouravam  అల్లు శిరీష్ కోసం కథల మీద కథలు..!
అల్లు శిరీష్ కోసం కథల మీద కథలు..!
Advertisement
Ads by CJ

మెగాఫ్యామిలీ హీరోలలో ఒకడిగా, అల్లుఅర్జున్ సోదరుడిగా, నిర్మాత అల్లుఅరవింద్ తనయుడిగా మంచి సినీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ తాను నటించిన చిత్రాలతో ఎవ్వరినీ మెప్పించలేక విమర్శల పాలైన హీరో అల్లు శిరీష్. 'యువత, ఆంజనేయులు, సోలో' చిత్రాలతో  మంచి గుర్తింపు  తెచ్చుకున్న దర్శకుడు పరుశురామ్.  పూరీ జగన్నాధ్ శిష్యునిగా, మంచి టాలెంట్, పంచ్ డైలాగులు బాగా రాయగలిగిన దర్శకునిగా పేరు తెచ్చుకున్నప్పటికీ తాను దర్శకత్వం వహించిన, రవితేజతో చేసిన 'సారొచ్చారు' చిత్రంతో విమర్శల పాలైనాడు పరుశురామ్. ఇలా పలు విమర్శలను ఎదుర్కొంటున్న అల్లు శిరీష్, పరుశురామ్ లు కలిసి ఓ కొత్త  చిత్రం చేయనున్నారని సమాచారం. వాస్తవానికి పరుశురామ్ 'చుట్టాలబ్బాయి' అనే టైటిల్ తో హీరో రామ్ కు ఓ స్టోరీ రెడీ చేసుకున్నాడు. ఆ తర్వాత అదే సబ్జెక్టుతో  రానా, నాగచైతన్య వంటి వారిని కలిసినప్పటికీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో చివరకు ఈ స్టోరీని విని అల్లు శిరీష్ ఓకే చేశాడని టాక్. ఈ చిత్రానికి ముందు ఓ కొత్త డైరెక్టర్ తో అల్లు శిరీష్ ఓ చిత్రం చేయనున్నాడు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత పరుశురామ్ తో పని చేయనున్నాడని తెలుస్తోంది. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? అల్లు శిరీష్ తో చేయడం పరుశురామ్ కు కలిసోస్తుందా? లేక బాడ్ చాయిసా... అనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాలి...!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ