Advertisementt

సంక్రాంతి కి గుణశేఖర్ కానుక..!

Fri 09th Jan 2015 07:23 AM
anushka,rudhramadevi,sankranthi,gunasekhar,trailer  సంక్రాంతి కి గుణశేఖర్ కానుక..!
సంక్రాంతి కి గుణశేఖర్ కానుక..!
Advertisement
Ads by CJ

కొత్త సంవత్సరం కానుకగా భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'రుద్రమదేవి' కి సంబంధించి అనుష్క ఫస్ట్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనుష్క రెగల్ లుక్ అదిరిపోయే విధంగా ఉందనే టాక్ ఈ లుక్ కి వచ్చింది. కాగా ఈ చిత్రానికి సంబంధించి దియేట్రికల్ ట్రైలర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం బిజినెస్ ఇప్పటికే స్లోగా మొదలైంది. అల్లు అర్జున్ అతిధి పాత్ర చేయడంతో ఈ చిత్రానికి మరింత క్రాజే ఏర్పడింది. దియేట్రికల్ ట్రైలర్ లో గోన గన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జున్ తో పాటు, ఆయన డైలాగ్ ని కూడా ఉండేలా గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గుణా టీం వర్క్స్ పతాకం పై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా ఈ చిత్రం రికార్డు సృష్టించనుంది. డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై గుణశేఖర్ తన జీవితాన్ని మొత్తం ఫణంగా పెట్టాడని తెలుస్తోంది. ఎంతో తెగింపు తో భారీగా బడ్జెట్ పెట్టి ఒడిదుడుకుల్లో వున్న తన కెరీర్ ను ఈ చిత్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఆయన సిద్ధం అవుతున్నాడు. అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారం లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ