Advertisementt

అర్ధరాత్రి వరకు ఆస్పత్రిలో జగన్‌..!!

Fri 09th Jan 2015 06:05 AM
jagan mohan reddy in jail,anathapuram bus accident,jagan about bus accident,jagan in ananthapuram district hospital,jagan mohan reddy vs chandrababu naidu,chandrababu naidu about anathapuram bus acident  అర్ధరాత్రి వరకు ఆస్పత్రిలో జగన్‌..!!
అర్ధరాత్రి వరకు ఆస్పత్రిలో జగన్‌..!!
Advertisement
Ads by CJ

అనంతపురం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించడంలో జగన్‌ గురువారం బిజీబిజీగా గడిపారు. బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి ఆయా గ్రామాలకు వెళ్లిన జగన్‌ బాధితులతోపాటు, వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. అనంతరం రాత్రి పదిగంటల సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జగన్‌ పరామర్శించారు. దాదాపు రెండున్నర గంటలు అంటే అర్ధరాత్రి 12.30 గంటల వరకు కూడా ఆస్పత్రిలోనే గడిపిన ఆయన బాధితులకు అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బెంగళూరులో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను మంత్రులు పరిటాల సునీత, గంటా తదితరులు పరామర్శించారు. బాధితులకు తగిన సేవలందేలా చూడాలని వైద్యులను కోరారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రతిపక్ష, అధికారపక్ష నాయకులు కూడా పోటాపోటీగా బాధితులను పరామర్శిస్తుండటం ఆహ్వానించదగిన విషయమే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ