Advertisementt

కేసీఆర్‌ కుమార్తెకు స్వైన్‌ఫ్లూ..??

Fri 09th Jan 2015 04:35 AM
mp kavitha swine flu,nizamabad mp kavitha,kavitha in hospital,cm kcr daughter kavitha,kavitha usband,kavitha father,kavitha brother,mp kavitha family  కేసీఆర్‌ కుమార్తెకు స్వైన్‌ఫ్లూ..??
కేసీఆర్‌ కుమార్తెకు స్వైన్‌ఫ్లూ..??
Advertisement
Ads by CJ

కేసీఆర్‌ కుమార్తె, నిజామాబాద్‌ ఎంపీ కవితకు స్వైన్‌ఫ్లూ సోకిందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని పలు జిల్లాల్లో పలువురు స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. అయితే ఏకంగా సీఎం కుమార్తెకే ఈ వ్యాధి సోకిందన్న వార్తలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. మూడు రోజుల క్రితం చలి జ్వరంతో బాధపడుతూ కవిత యశోద ఆస్పత్రిలో చేరారు. మొదట సాధారణ జ్వరమని భావించిన వైద్యులు పరీక్షలు జరపగా స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించినట్లు సమాచారం. ఈ మేరకు ఎంపీ కవితకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని కూడా ప్రచురించింది. అయితే అధికారులు మాత్రం స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తుల జాబితాలో కవిత పేరు చేర్చలేదు. మరోవైపు కవితకు స్వైన్‌ఫ్లూ సోకిందన్న వార్తలతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ