ప్రజాప్రతినిధులు ఇప్పుడు హెలిక్యాప్టర్లు, విమానాల్లో తిరగడం ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. రాష్ట్రాలు వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయినప్పటికీ వీరు రైళ్లలో ప్రయాణాలు చేయడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. 50 కిలోమీటర్ల దూరానికి కూడా హెలిక్యాప్టర్లు లేనిదే అడుగు బయటకు వేయడం లేదు. అభివృద్ధి విషయంలో పోటీ ఉన్నా లేకున్నా.. ఈ విషయంలో మాత్రం కేసీఆర్, బాబులు సై అంటే సైసై అంటున్నారు. ఇక తెలంగాణకు సొంత హెలిక్యాప్టర్ లేకపోవడంతో కేసీఆర్ అద్దె హెలిక్యాప్టర్లలో తన ఏరియల్ సర్వేలు, పర్యటనలు కొనసాగిస్తున్నాడు. గత నాలుగు నెలల కాలంలో హెలిక్యాప్టర్‌లకు అద్దె రూపంలో కేసీఆర్ రూ. 6 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఇందులో 4.92 కోట్లను ప్రభుత్వం ఇటీవలె విడుదల చేసింది. ఇక చంద్రబాబు విషయానికొస్తే ఆయన విదేశీ పర్యటనలకు కూడా ప్రత్యేక విమానాలనే వాడుతుండటంతో కేసీఆర్ కంటే ఆయన అధికంగానే ఖర్చు పెట్టి ఉంటారన్నది అధికారవర్గాల అంచనా. కనీసం ఏపీ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా బాబు కాస్త తన గాలి ప్రయాణాలను తగ్గించుకుంటే మంచిదేమోనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.