షర్మిల అడుగు వెనక్కి వేయడం లేదు. తెలంగాణలో పార్టీకి అస్థిత్వమే లేకున్నా.. ఆమె మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తెలంగాణలో వైసీపీని బలపర్చడమే లక్ష్యంగా షర్మిల తన 'పరామర్శ యాత్ర'ను కొనసాగిస్తోంది. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగిన షర్మిల యాత్ర ఇక ఇప్పుడు నల్గొండ జిల్లాలో కొనసాగనుంది. ఈనెల 21 నుంచి నల్గొండ జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారిని ఈ పర్యటనలో షర్మిల పరామర్శించనున్నారు. మొత్తం 7 రోజుల్లో 6 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను పరామర్శిస్తూ షర్మిల పర్యటన కొనసాగనుంది. మహబూబ్‌నగర్ పర్యటనకు తగినంత స్పందన రాకపోవడంతో ఈసారి పరామర్శయాత్రను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.