ఇటీవల అక్కినేని అవార్డు అందుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చిన బిగ్-బి అమితాబ్ సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ధికి తన సేవలు వినియోగించుకోవాలని కోరారు. దీంతో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమానికి అమితాబ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవాలని టీ-సర్కారు యోచిస్తోంది. ఇంతలోనే ఏపీలో వైద్య ఆరోగ్య రంగానికి అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. ఈ విషయమై ఇంకా బిగ్-బి ధ్రువీకరించాల్సి ఉంది. అయితే బిగ్-బిని తాము ముందే బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటే, ఆయన సేవలను వినియోగించుకోవడానికి టీ-సర్కారు వెనకడుగు వేసే అవకాశముందని, ఇది తమకు లబ్ధి చేస్తుందన్న ఆలోచనతోనే మంత్రి కామినేని ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా సానియామీర్జా రూపంలో ఓ పెద్ద సెలబ్రిటీ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉందని, అమితాబ్ అయితేనే ఆమె స్థాయికి మించి ఏపీ ప్రభుత్వ అభివృద్ధికి సహాయ పడగలరని కూడా ఏపీ సర్కారు యోచించినట్లు సమాచారం.