Advertisementt

కామెడీపై మోజు పడుతోన్న స్టార్స్..!

Tue 06th Jan 2015 01:53 PM
nandamoori balakrishna,ram charan,mass action,entertainment,comedy,sreenuvaitla,sreevas,kona venkat,gopimohan  కామెడీపై  మోజు పడుతోన్న స్టార్స్..!
కామెడీపై మోజు పడుతోన్న స్టార్స్..!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ లు ఇప్పుడు రెండో వైపు చూస్తున్నారు. బాలయ్య విషయానికి వస్తే పవర్ ఫుల్ డైలాగులు, మాస్ యాక్షన్ చిత్రాలు ఎక్కువగా చేస్తున్న ఆయన గతంలో కొన్ని సినిమాల్లో మంచి కామెడీని సైతం అద్భుతంగా చేసాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఆ టైప్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు దూరంగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం సత్య దేవా అనే నూతన దర్శకునితో 'ఎన్. బి. కె. లయన్' చిత్రం చేస్తోన్న ఆయన 99 వ చిత్రంగా 'పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం' వంటి చిత్రాలతో కామెడీని బాగా హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్న 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం లో నటించనున్నాడు. ఈ చిత్రానికి ఎంటర్టైన్మెంట్ చిత్రాల స్టార్ రైటర్స్ కోన వెంకట్, గోపి మోహన్ లు రచయితలుగా పనిచేస్తున్నారు. అదే సమయంలో పక్కా మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ తాను నటించే తదుపరి రెండు చిత్రాలను ఎంటర్టైన్మెంట్ బేస్ గా ఉండే వాటినే చేయనుండటం విశేషం. కామెడీలో ఇప్పటివరకు తనను తాను పూర్తిగా ప్రూవ్ చేసుకోలేకపోయినా రామ్ చరణ్ త్వరలో ఎంటర్ టైన్మెంట్ ను బాగా పండించగలిగిన శ్రీనువైట్ల దర్శకత్వం లో నటించనున్నాడు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ రచయితగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాతి చిత్రాన్ని కూడా కోన వెంకట్, గోపీమోహన్ లు రచయితలుగా, సురేంద్రరెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం ఓకే చేసినట్లు సమాచారం. ఇలా వెంటవెంటనే రెండు ఎంటర్ టైన్మెంట్ చిత్రాలను రామ్ చరణ్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. అన్ని రసాలలోకి హాస్య రసం పండించడం కష్టంగా చెప్పుకుంటారు. మరి ఈ ఇద్దరు స్టార్స్ రాబోయే చిత్రాల్లో కామెడీని ఎలా పండిస్తారు? అనే విషయంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ