దక్షినాది స్టార్ హీరోయిన్లలో హన్సిక ఒకరు. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో హన్సిక స్టార్ హీరోయిన్. ఆమె చేస్తున్న సినిమాలలో ఎక్కువగా తమిళ సినిమాలే ఉంటాయి. అక్కడ ఆమెకు ఖుష్బూ, నమిత తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉంది. అయితే హీరోయిన్ అంటే కేవలం అందం, అభినయం ఉంటె చాలదు. పనిపట్ట నిబద్ధత ఉండాలి. షూటింగ్ విషయంలో దర్శకనిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. అలాంటి వారిలో హన్సిక ఒకరు అని అంటుంటారు. ఇదంతా ఓకే గానీ హన్సిక ఓ విషయంలో మాత్రం నిర్మాతలను ఇబ్బందిపెడుతోందట. హన్సికను హీరోయిన్ గా బుక్ చేసుకున్న వాళ్లకు ఖర్చు తడిపిమోపడవుతోందని విమర్శలు వస్తున్నాయి. ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్ తో సమానంగా ఇతర ఖర్చులు అవుతున్నాయట. సినిమా షూటింగ్ సమయంలో ఆమె ఫైవ్ స్టార్ హోటల్ వసతి ఖర్చులు, ఫైవ్ స్టార్ హోటల్ నుండి తెప్పించే తిండి, విమాన టికెట్ల ఖర్చులు, ఆమె పర్సనల్ సిబ్బందికి కూడా తనలాగే వసతులు కల్పించాలనే నిభందన, స్నానానికి కూడా మినరల్ వాటర్, ఇవన్నీ నిర్మాత ఖాతాలోనే వేస్తుందట. పెద్ద పెద్ద సంస్థల నిర్మాతలు ఈ ఖర్చు విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, ఓ మోస్తరు నిర్మాతలు మాత్రం ఆమె ఖర్చు విషయంలో ఇబ్బందిపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.