సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత మంచి ముహూర్తాలు చేసుకొని మన స్టార్ హీరోలు కొత్త చిత్రాలను ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ - సుకుమార్ ల కాంబినేషన్ లో రానున్న చిత్రంతో పాటు, పవన్ కళ్యాణ్ హీరోగా బాబి దర్శకత్వంలో నటించనున్న 'గబ్బర్ సింగ్2' చిత్రం కూడా జనవరి చివరలో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఇక రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న 'బెంగాల్ టైగర్', అఖిల్ - వినాయక్ ల చిత్రంతో పాటు నాగ చైతన్య నటించే కొత్త సినిమా షూటింగ్ కూడా జనవరి చివరలో ప్రారంభం కానున్నాయి. రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ముహూర్తం కూడా అప్పుడే ఖరారు చేయనున్నారు. వీరితో పాటు పలు యంగ్ హీరోల చిత్రాలు కూడా షూటింగ్ లు ప్రారంభించుకొని ఫిబ్రవరి ఉంచి మంచి ఊపుతో షూటింగ్ జరుపుకోవడానికి రెడీ అవుతున్నాయి.