బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో హిందూ అతివాదులు రెచ్చిపోతారని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అఖిల భారత హిందూ సంస్థ రోజుకో కొత్త రకం డిమాండ్‌తో ప్రజలను షాక్‌కు గురిచేస్తోంది. మహాత్మా గాంధీ హత్యకు కారణమైన గాడ్సేకు గుడి కట్టించనున్నట్లు చెప్పి ఆ సంస్థ సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఇండియన్ కరెన్సీని టార్గెట్ చేసింది. కరెన్సీ నోట్లపై ముద్రించిన మహాత్మా గాంధీ చిత్రం స్థానంలో మరో ప్రముఖ భారత సిద్ధాంకర్త ఫొటోను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. మహాత్మాగాంధీ స్థానంలో శివాజీ, మహారాణా ప్రతాప్, బీఆర్ అంబేద్కర్‌ల ఫొటోలను ఏర్పాటు చేయాలని కోరింది. అంతేకాకుండా గాంధీని జాతిపితగా పేర్కొనవద్దని కూడా చెప్పింది. ఇక జనవరి 30న గాడ్సే గుడి నిర్మాణానికి పునాది రాయి వేయనున్నామని, ఆ రోజును శౌర్య దివాస్‌గా పాటించాలని పేర్కొంది. మరి ఈ డిమాండ్లపై బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే..!