Advertisementt

నారా రోహిత్ ని కలిసిన అభిమానులు

Sun 04th Jan 2015 01:12 AM
hero nara rohith,nara rohith fans meet,nara rohith next movie,nara rohith latest movie rowdy fellow,nara rohith fans,nara rohith with fans  నారా రోహిత్ ని కలిసిన అభిమానులు
నారా రోహిత్ ని కలిసిన అభిమానులు
Advertisement
Ads by CJ

ఈ రోజు నారా రోహిత్ గారిని రొహిత్ ఫాన్స్ అసోసియేషన్, బ్రింగ్ బాబు బ్యాక్ మరియు చెన్నై టి.డి.పి ఫోరం తరుపున సుమారు ౩౦ మంది యువకులు కలవడం జరిగింది. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నారా రొహిత్ గారికి  2015 సంవత్సరము లో మంచి కమర్షియల్ హిట్ రావాలి అని అందరూ కోరుకోవడం జరిగింది. ఫాన్స్ అసోసియేషన్ బలోపేతం గురించి మాట్లాడటం జరిగింది. సి.బి.యెన్ ఆర్మీ రొహిత్ కోసం ఆహిర్నిసలు కృషి చెయ్యడానికి, నారా ఫాన్స్ అసోసియేషన్ ని బలోపేతం చెయ్యడానికి కృషిచేస్తుంది అని చెన్నై టి.డి.పి ఫోరం నంద కిషోర్ తెలియజేసారు. తన ప్రస్తుతము చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి అడిగినప్పుడు త్వరలో  పండగలా వచ్చాడు మరియు అసురా మీ ముందుకు వస్తున్నాయి అని, మీరు అందరూ ఆదరించాలి అని తెలియజేయడం జరిగింది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ రెండు ప్రాజెక్ట్స్ డిస్కషన్ లో ఉన్నాయి అని వీలు అయ్యిన త్వరగా సెట్స్ మీదకి వస్తాయి అని, వాటిలో ఒకటి సొంత బ్యానర్ లో ఉంటుంది అని చెప్పారు. మల్టీ స్టార్స్ మూవీస్ గురించి ప్రస్తావించినప్పుడు తానూ బాలయ్య బాబు మూవీస్ చూస్తూ పెరిగాను అని, ఆయనతో అవకాశం వస్తే తప్పనిసరిగా చేస్తాను అని చెప్పడం జరిగింది. పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగినప్పుడు, పెద్దనాన్న మరియు లోకేష్ గారులు ఆదేశానుసారము నడుచుకొంటాను అని చెప్పడం జరిగింది. బ్రింగ్ బాబు బ్యాక్ మరియు చెన్నై టి.డి.పి ఫోరం వాళ్ళు వాలంటీర్ గా ముందుకి వచ్చి చేసిన కార్యక్రమాలని అభినందిచడం జరిగింది. ఈ కార్యక్రమం లో నారా ప్రశాంత్, చెన్నై టి.డి.పి ఫోరం ప్రెసిడెంట్ నంద కిషోర్, బ్రింగ్ బాబు బ్యాక్ కోర్ టీం మెంబెర్స్  హరి గొట్టిపాటి, రమేష్ ఎర్రగుంట, నరేంద్ర, అబ్బయ్య నాయుడు, పవన్, వెంకట్ గోనుగుంట, రాంబాబు పాల్గొనడం జరిగింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ