Advertisementt

రికార్డులు తిరగరాస్తున్న 'పీకే'

Sun 04th Jan 2015 01:09 AM
pk records,pk collections,ameerkhan in pk,pk beating dhoom3 collections,pk new records,anushka in pk,rjakumari hirani film pk  రికార్డులు తిరగరాస్తున్న 'పీకే'
రికార్డులు తిరగరాస్తున్న 'పీకే'
Advertisement
Ads by CJ

'పీకే' సినిమా గత బాలీవుడ్‌ రికార్డులను తిరగరాస్తోంది. రూ. 600 కోట్ల కలెక్షన్లవైపు వేగంగా పరుగులు తీస్తూ సరికొత్త రికార్డును సృష్టించడానికి కొన్ని అడుగుల దూరంలో నిలిచింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి రెండు వారాలు గడిచింది. ఇప్పటివరకు డొమెస్టిక్‌ మార్కెట్‌లో 'పీకే' రూ.394 కోట్లను కలెక్ట్‌ చేసింది. ఇక ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఈ సినిమా రెండు వారాలకు కలిపి ఇప్పటివరకు రూ. 122 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఓవరాల్‌గా రెండు వారాల్లో 'పీకే' కలెక్షన్లు రూ. 516 కోట్లకు చేరుకున్నాయి. విడుదలైన రెండు వారల్లోనే రూ. 500 కోట్ల మార్క్‌ దాటిన మొదటి బాలీవుడ్‌ సినిమాగా పీకే చరిత్ర సృష్టించింది. ఇక అత్యధిక వసూళ్లకు సంబంధించి 'ధూమ్‌-3'' కలెక్ట్‌ చేసిన రూ.560 కోట్లే ఇప్పటివరకు బాలీవుడ్‌లో రికార్డుగా ఉంది. వచ్చేవారం కూడా బాలీవుడ్‌లో పెద్ద సినిమాల రిలీజ్‌ లేకపోవడంతో సునాయాసంగా 'పీకే' రూ. 600 కోట్ల క్లబ్‌లో చేరి గత రికార్డులన్ని తిరగరాస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ