సంక్రాంతి వచ్చిందంటే కోడి పందేల రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారాల్సిందే. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ కోడి పందేలు ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల వీటిపై హైకోర్టు నిషేధం విధించింది. కోడి పందేలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సారి సంక్రాంతికి సందడి దూరమయ్యే అవకాశం ఉందని ఇటు పందెంరాయుళ్లు అటు ప్రజలు కూడా నిరుత్సాహపడ్డారు. దీన్ని గమనించిన బీజేపీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ఏకంగా సుప్రీంకోర్టు తలుపుతట్టారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న కోడి పందేలాపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ కేసుపై జనవరి 7వ తేదీన సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇక కోళ్ల పందేలాకు సుప్రీం పచ్చజెండా ఊపితే సంక్రాంతికి ఆంధ్రాలో సందడే.. సందడి..!