వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మిగిలిన నేతల్లో గట్టు రామచంద్రరావు ముఖ్యులు. ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు. ఇక ఆయన కూడా ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశాడు. కొన్నాళ్లుగా ఈయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయమై ఆయన ఏమీ తేల్చకుండానే వైసీపీనుంచి వైదొలిగారు. అంతేకాకుండా వైసీపీని వీడిన నాయకులు చెప్పిన మాటలనే గట్టు రామచంద్రరావు రిపీట్ చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వైఖరికి నిరసనగానే తాను పార్టీ వీడుతున్నట్లు గట్టు రామచంద్రరావు ప్రకటించారు. అయితే తాను భవిష్యత్తుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పకొచ్చాడు. మరోవైపు తెలంగాణలో వైసీపీని బలపర్చాలన్నా ప్రయత్నాల్లో ఉన్న జగన్‌కు గట్టు పార్టీని వీడటం పెద్ద దెబ్చేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీని గాడిన పెడుదామన్న జగన్ ప్రయత్నాలకు గట్టు రూపంలో ఆదిలోనే అడ్డంకి ఎదురైంది.