సీఎం రమేష్ తెలుగు దేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదుగుతున్నారు. ఆయన మాటకు బాబు ఎంతో విలువనిస్తారు. అయితే అనుకోకుండా ఆయన పార్టీకి ఓ సమస్య తెచ్చిపెట్టారు. కడప జెడ్పీ సమావేశానికి ఆయన హాజరుకావడం రచ్చకు దారి తీసింది. రాజ్యసభ ఎంపీల పంపకాల్లో భాగంగా ఆయన్ను తెలంగాణకు కేటాయించారు. దీంతో ఆయనకు కడప జెడ్పీ సమావేశంలో పాల్గొనే అధికారం లేకుండా పోయింది. అయినప్పటికీ సీఎం రమేస్ వచ్చేసి జెడ్సీ పమావేశంలో కూర్చోవడం, దీనికి వైసీపీ జెడ్పీటీసీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. చివరకు జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ.. సీఎం రమేష్‌కు జెడ్పీ సమావేశంలో కూర్చునే హక్కులేదని తేల్చారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం రమేష్ జెడ్పీ సమావేశంలోనే నిరసనకు దిగారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొనడంతో జెడ్పీ సమావేశాన్ని వాయిదా వేశారు. సీఎం రమేష్ పాలక పార్టీ సభ్యుడి అయినంత మాత్రానా నిబంధనలకు విరుద్ధంగా వచ్చి జెడ్పీ సమావేశంలో పాల్గొనడమే కాకుండా, సభ వాయిదా పడటానికి కూడా కారణమయ్యాడని వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.