లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తనయుడు, యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇటీవల ముస్లిం మతం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తన తనయుడు ఇలా చేయడం ఇళయరాజా కు ఇష్టంలేదని కోలీవుడ్ టాక్. కాగా యువన్ శంకర్ రాజా జనవరి 1వ తేదీన మూడో వివాహం చేసుకున్నాడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కిజకరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం యువతి జఫరున్నీస్సాను ఆయన పెళ్ళాడాడు. ఈ వేడుకకు ఆయన తండ్రి ఇళయరాజా హాజరుకాలేదు. అక్టోబర్ 28, 2014 న చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా ఆయన వివాహం చేసుకొన్నాడు. 35 సంవత్సరాల యువన్ 2005 లో మార్చి 21 న తన లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ సుజయ చంద్రన్ ను పెళ్ళాడాడు. ఆమె లండన్ లో సెటిలైన సింగర్. తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారం తో విడిపోయారు. 2008 లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. తర్వాత 2011 లో సెప్టెంబర్ 1 న శిల్పా అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు. కొంత కాలానికి వీరి దాంపత్య జీవితం బీటలు వారింది. చాలా రోజుల నుండి యువన్ ఒంటరిగానే ఉన్నాడు. మొత్తానికి ఈ వేడుకకు ఇళయరాజా రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని కోలీవుడ్ మీడియా అంటోంది.