వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సినిమాకు రెడీ అయ్యాడు. ఈసారి ఆయన సచిన్ జోషి హీరోగా సినిమా తీయబోతున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నాడు. చాలాకాలంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న వర్మ ఇప్పుడు సచిన్ ద్వారా బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా తెలుగులో సచిన్ జోషి హీరోగా చేసిన ఏ చిత్రం కూడా సక్సెస్ కాలేదు. ఇటీవలే ఆయన బండ్ల గణేష్ తో కలిసి 'నీజతగా నేనుండాలి' చిత్రం చేసాడు. 'ఆషికి 2' కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అదే సమయంలో ఇటీవల కాలంలో వర్మ తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ ఫలితాలను రాబట్టలేకపోయాయి. ఇలా ఫ్లాప్ ల్లో ఉన్న సచిన్ జోషి, వర్మల కాంబినేషన్ లో రానున్న ఈ తాజా చిత్రం కనీసం యావరేజ్ మార్కులైనా సంపాదించుకుంటుందో లేదో వేచిచూడాల్సివుంది.